వీకెండ్ షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో ఎంత పెరిగాయంటే..?

వీకెండ్ షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో ఎంత పెరిగాయంటే..?

ఇరాన్ విషయంలో తగ్గేదేలేదని ట్రంప్ తేల్చి చెప్పటంతో పాటుగా క్యూబాపై ఆంక్షలను పొడిగించటం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. దీంతో బంగారం, వెండి రేట్లు ఏరోజు తగ్గుతాయో ఏరోజున పెరుగుతాయో వ్యాపారులు సైతం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో రేట్లను పరిశీలించండి.

మే 2న బంగారం రేట్లు పెరిగాయి. మే 1 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.33 పెరుగుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 093గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 835గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 2, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు మాత్రమే పెరిగి రూ.2లక్షల 70వేల వద్ద ఉంది. అంటే గ్రాము ధర రూ.270గా అమ్మకాలు జరుగుతున్నాయి.