Gold & Silver: మంగళవారం దూసుకుపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. ఏపీ తెలంగాణ రేట్లు ఇవే..

Gold & Silver: మంగళవారం దూసుకుపోతున్న గోల్డ్ అండ్ సిల్వర్.. ఏపీ తెలంగాణ రేట్లు ఇవే..

Gold Rates Today: వెనెజువెలాపై అమెరికా చర్యల తర్వాత బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ మెటల్స్ దిశగా అడుగులు వేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొత్త ఏడాది మెల్లగా తగ్గుతాయ్ అనుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా మీ ప్రాంతాల్లో ధరలను పరిశీలించటం అవసరం. 

తెలుగు రాష్ట్రాల్లో జనవరి 6న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 5 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.60 పెరుగుదలను చూసింది. తాజా ర్యాలీతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 882గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 725గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : టెలికం ఆపరేటర్లకు రూ.150 కోట్ల ఫైన్

ఇక వెండి కూడా తన ర్యాలీని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. సరఫరా సమస్యలతో పాటుగా మరోపక్క అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే మంగళవారం జనవరి 6, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరుగుదలను నమోదు చేసి కొనుగోలుదారులకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 71వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.271 వద్ద ఉంది.