టెలికం ఆపరేటర్లకు రూ.150 కోట్ల ఫైన్

టెలికం ఆపరేటర్లకు రూ.150 కోట్ల ఫైన్

న్యూఢిల్లీ: అనవసర కాల్స్, మెసేజ్ లను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికం ఆపరేటర్లకు ట్రాయ్​.150 కోట్ల జరిమానా విధించింది. 2020 నుంచి మూడేళ్ల కాలానికి ఈ జరిమానా విధించింది. ట్రాయ్​ నిర్ణయాన్ని కంపెనీలు సవాలు చేశాయి.   నిబంధనల ప్రకారం ఒక్కో సర్కిల్ లో నెలకు రూ.50 లక్షల వరకు జరిమానా వేయొచ్చు. గత ఏడాది ట్రాయ్ 21 లక్షల  స్పామ్​ కనెక్షన్లను తొలగించింది. లక్ష సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. 2024 సెప్టెంబర్ లోనే 18.8 లక్షల కనెక్షన్లను నిలిపివేసింది. 

స్పామ్​ను అరికట్టడానికి రూల్స్​ను కఠినతరం చేసింది. బ్యాంకింగ్, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కాల్స్ కు 1600 సిరీస్ నంబర్లను కేటాయించింది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ ల చివర ‘పి’, సర్వీస్ మెసేజ్ ల చివర ‘ఎస్’ వంటి అక్షరాలు ఉండాలని స్పష్టం చేసింది. సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయడం నిషిద్ధం. గత 10 రోజుల్లో ఒక నంబర్ పై ఐదు ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రాయ్​ ఆదేశించింది.