BELలో ఉద్యోగాలు: మంచి జీతం.. బీఈ/బీటెక్ అర్హత ఉంటే చాలు..

BELలో ఉద్యోగాలు:  మంచి జీతం.. బీఈ/బీటెక్ అర్హత ఉంటే చాలు..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్. పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమై, మార్చి 30న ముగుస్తుంది.

ఖాళీలు: 5. సీనియర్ ఇంజినీర్ ఈ–III.  

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్​లో మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. కనీసం నాలుగేండ్ల పని అనుభవం ఉండాలి .

గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్ల అనుభవం ఉండాలి 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 10. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.600. 

లాస్ట్ డేట్: మార్చి 30.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు  bel-india.in వెబ్​సైట్​ను సందర్శించండి.