బంగారం, వెండి ధరలు అటు ఇన్వెస్టర్లకు ఇటు రిటైల్ కొనుగోలుదారులకు అర్థం కాకుండా రోజురోజుకూ మారిపోతున్నాయి. ఒకరోజు పెరిగితో మరో రోజు తగ్గుతూ బులియన్ మార్కెట్లలో ఏం జరుగుతోందో కూడా జనానికి తెలియట్లేదు. తగ్గుతాయ్ అని వెయిట్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల షాపర్స్ కూడా డైలమాలో పడుతున్నారు. ప్రధానంగా అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పరిస్థితులు దిగజారగటం, ట్రంప్ టారిఫ్స్, అమెరికా డాలర్ బలహీనం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు లాంటి చాలా అంశాలు ప్రస్తుతం ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 10న బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.120 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 551గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 255గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.
