ఉప్పల్, వెలుగు: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ బంగారు ఆభరణాల పర్సును దొంగలు కొట్టేశారు. వరంగల్‌కు చెందిన లావణ్య ఉప్పల్ రింగ్ రోడ్డులో బుధవారం హన్మకొండ వెళ్లడానికి జనగాం డిపో బస్సు ఎక్కింది. రద్దీలో బస్సు ఎక్కి కూర్చుని చూడగా బంగారం ఉన్న పర్సు కనిపించలేదు.
పోలీసులకు సమాచారం అందించడంతో వారు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినా ఆభరణాలు దొరకలేదు. పర్సులో రెండు తులాల చైన్, కమ్మలు ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
