ఆగని బంగారం ధరల పరుగులు.. దిగొచ్చిన వెండి.. దీపావళి తర్వాత కొత్త ధరలు ఇవే..

ఆగని బంగారం ధరల పరుగులు.. దిగొచ్చిన వెండి.. దీపావళి తర్వాత కొత్త ధరలు ఇవే..

దీపావళి పండగ తరువాత బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దింతో ధరలు తగ్గుతాయనుకున్నా కస్టమర్లకి షాకిచ్చినట్టైంది. అయితే ఈ నెల మొదటి నుండి బంగారం ధరలు పెరుగుతూ వస్తూ, సామాన్యులు కొనేందుకు కూడా ఆలోచించేల మారాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో దీపావళి రోజున బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయంగా వస్తుంది. కానీ దీపావళి రోజున ఉరించినట్టే ఊరించి కాస్త దిగ్గొచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా మళ్ళీ ఎగిశాయి.    

ఇవాళ 24 క్యారెట్ల బంగారం  1గ్రామ ధర రూ. 208 పెరిగి రూ.13,277 చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 190 పెరిగి రూ.12,170, 18 క్యారెట్ల ధర రూ. 156 పెరిగి రూ. 9,958. 

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,32,770తో రూ.2,080 పెరిగింది. 22 క్యారెట్ల  ధర  రూ.1,900 పెరిగి రూ.1,21,700 , 18 క్యారెట్ల ధర రూ.1,560 పెరిగి  రూ.99,580. 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,32,770, 22 క్యారెట్ల ధర     రూ.1,21,700, 18 క్యారెట్ల ధర రూ.99,580. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,32,770, 22 క్యారెట్ల ధర     రూ.1,21,700, 18 క్యారెట్ల ధర రూ.99,580.      

ఇక వెండి  ధర ఇవాళ కాస్త చల్లబడింది. ప్రస్తుతం 1 లక్ష 70 వేల నుండి 2 లక్షలకి పరుగులు పెడుతున్న వెండి కేజీ ధర ఇవాళ దిగొచ్చింది. దింతో వెండి గ్రాము ధర రూ.2 తగ్గి రూ.170 ఉండగా,  కేజీ ధర 2 వేలు తగ్గి రూ.1 లక్ష 70 వేలుగా ఉంది.