రెండో రోజూ బంగారం రేట్లు నేలచూపులు.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు..

రెండో రోజూ బంగారం రేట్లు నేలచూపులు.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు..

ఇరాన్ విషయంలో పురోగతి ఊహించిన దానికంటే నెమ్మదిగా కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్లలో జోరు కనిపించటం లేదు. అటు డిజిటల్ ఇన్వెస్టర్లు ఇటు రిటైల్ కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని కొనసాగిస్తున్నారు. దీంతో గతంలో కంటే బంగారానికి గిరాకీ సన్నగిల్లిందని వ్యాపారులు చెబుతున్నారు. పన్నుల పెంపు కూడా ఈ పరిస్థితులకు ఒక కారణంగా వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తగ్గిన రేట్లలో షాపింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్లు తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం బెటర్. 

మే27న బంగారం రేట్లు తగ్గాయి. మే 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.60 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 829గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 510గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 27, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు మార్పు లేకుండా రూ.2లక్షల 95వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.295 దగ్గర ఉంది.