
గోల్ఫ్ ఛాంపియన్ టైగర్ వుడ్స్ కారు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7:12 గంటల సమయంలో రోలింగ్ హిల్స్ ఎస్టేట్స్ సమీపంలో ఆయన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దాంతో టైగర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ప్రమాదానికి గురైన వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే రెస్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని.. ఆయనను వెంటనే హార్బర్-యుసిఎల్ఎ మెడికల్ సెంటర్కు అంబులెన్స్ ద్వారా తరలించారు. రెస్యూ సిబ్బంది వచ్చిన తర్వాత కూడా వుడ్స్ వారితో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తీరును తెలిపాడు. వుడ్స్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పలువురు సెలబ్రెటీలు ప్రార్థనలు చేస్తున్నారు.
For More News..