గర్భిణి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

గర్భిణి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఏడు మార్కులు కలపడంతో అర్హత సాధించిన పోలీసు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల్లో గర్భిణులు, ఇటీవల మాతృత్వం పొందిన తల్లులకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ దగ్గర కొంతమంది గర్భిణి అభ్యర్థులు తమకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు మరోసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

జనవరిలో ఇచ్చిన ఆర్డరే ప్రస్తుత బ్యాచ్ కు కూడా వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఏడు మార్కులు కలపగా అర్హత సాధించిన గర్భిణులు, ఇటీవల మాతృత్వం పొందిన తల్లులు తగు ఆధారాలతో నిర్ణీత ప్రొఫార్మాలో అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వన్ టైమ్ అవకాశం కింద తుది రాతపరీక్షకు హాజరు కావచ్చని వెల్లడించింది. ఫైనల్ పరీక్షల్లోనూ అర్హత సాధించినట్టయితే ఆ తర్వాత బోర్డు నిర్వహించే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుకు విధిగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.