వెలుగు వార్తకు స్పందన : గోపాలపురం స్కూల్ కు రూ.30 లక్షలు మంజూరు

 వెలుగు వార్తకు స్పందన : గోపాలపురం స్కూల్ కు రూ.30 లక్షలు మంజూరు

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేప్టటింది. ఇందులో భాగంగా క్లాస్ రూమ్స్ నిర్మాణంతో పాటు అవసరమైన అభివృద్ధి పనుల కోసం రూ. 30 లక్షలు మంజూరు చేసింది.

 శిథిలావస్థకు చేరిన స్కూల్ పరిస్థితిపై గత నెల 29న 'వెలుగు' దినపత్రికలో ‘శిథిల భవనంలో చదువు.. వానొస్తే సెలవు’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ దివాకర గురువారం స్కూల్ ను పరిశీలించారు. 

త్వరలోనే పనులు ప్రారంభించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుటామని కలెక్టర్​చెప్పారు. సొంతంగా రూ. 40 వేలు ఖర్చు చేసి తాత్కాలిక షెడ్ నిర్మించిన హెచ్ ఎం నిమ్మతోట ఇందిరను కలెక్టర్ సన్మానించారు.