గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 2.23 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద గేట్ల ద్వారా 1,75,706 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29 వేల క్యూసెక్కులతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ తో పాటు సమాంతర కాలువకు, రైట్, లెఫ్ట్ కెనాల్స్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి మొత్తం 2,08,500 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.
