- తెలుగుతోపాటు హిందీ తదితర ప్రాంతీయ భాషల్లో కామెంటరీ
- సోని టెన్ -4లో తెలుగు కామెంటరీతో ఫుట్ బాల్ మ్యాచుల ప్రసారాలు
భారత దేశంలోని ఫుట్ బాల్ అభిమానులకు శుభవార్త. సోని పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఇక నుంచి భారత దేశంలో ఇంగ్లీషు, హిందీతోపాటు తెలుగు, తమిళ, మళయాళం తదితర ప్రాంతీయ భాషల్లో కామెంటరీని అందుబాటులోకి తెచ్చింది. ఈనెల 11 నుండి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లైన UEFA యూరో 2020 మరియు కోపా అమెరికా 2021 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.దీని కోసం ప్రముఖ శ్రేణి ప్యానలిస్టులతో ఒప్పందాలు చేసుకున్నట్లు సోని ప్రకటించింది.
ఈనెల 11 నుంచి యూరప్‌లోని 11 నగరాల్లో ప్రసారం కానున్న UEFA యూరో ఉత్కంఠభరితమైన ఆటలను SONY TEN 2, SONY TEN 3, SONY SIX మరియు SONY TEN 4 ఛానెళ్లతో పాటు Sony LIV లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. కోపా అమెరికా 2021 జట్టు ఆటను కూడా 14 జూన్ నుంచి ప్రసారం చేస్తామని సోని ప్రకటించింది. కోపా అమెరికా మ్యాచులను ఇంగ్లీష్, బెంగాలీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలలో అలాగే SONY TEN 1, SONY TEN 2, SONY SIX మరియు SONY TEN 4 ఛానెళ్లలో ప్రసారమవుతుంది. కొత్త ప్రాంతీయ భాషా క్రీడా ఛానెల్ SONY TEN 4లో తెలుగులో ప్రసారం జరుగుతుంది. మ్యాచులో ఇరు జట్ల బలా బలాల విశ్లేషణలు, వ్యూహాలు, మాజీ క్రీడాకారుల అభిప్రాయాలు తెలుగు భాషలో అందించేందుకు సందీప్ కుమార్ బి., సుధీర్ మహావాడి, జోసెఫ్ ఆంటోనీ మరియు నార్మన్ స్వరూప్ ఐజాక్ తదితరులతో ఒప్పందం చేసుకున్నట్లు సోని వెల్లడించింది.
