
ఐండోవెన్ (నెదర్లాండ్స్): ఇండియా–ఎ మెన్స్ హాకీ టీమ్ తమ యూరప్ టూర్‌ను ఘన విజయంతో ఆరంభించింది. ఇక్కడి హాకీ క్లబ్ ఒరాంజ్-రూడ్ గ్రౌండ్‌లో మంగళవారం (జులై 08) రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6–-1 తో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది.
ఇండియా తరఫున ఉత్తమ్ సింగ్, అమన్‌దీప్ లక్రా, ఆదిత్య లలాగే, సెల్వం కార్తీ, బోబీ సింగ్ ధామి గోల్స్ ఒక్కో గోల్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇండియా కుర్రాళ్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. నాలుగు క్వార్టర్లలోనూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆడారు. క్రమం తప్పకుండా గోల్స్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
ఇండియా డిఫెండర్లు కూడా సత్తా చాటడంతో ఐర్లాండ్ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. తర్వాతి మ్యాచ్‌లో మరోసారి ఐర్లాండ్‌తో పోటీ పడనున్న ఇండియా.. తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లండ్, బెల్జియం, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.