హైదరాబాద్, వెలుగు: మనదేశ డిజిటల్ లక్ష్యాలను చేరుకోవడానికి గూగుల్, అదానీ, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న ఏఐ హబ్ చాలా కీలకమని భారతీ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ అన్నారు. ప్రపంచ ఏఐ మ్యాప్‌లో విశాఖ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని పేర్కొన్నారు.
తమ వద్ద ఉన్న అత్యుత్తమ డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, దేశవ్యాప్త అల్ట్రా లో లేటెన్సీ ఫైబర్, అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సహాయంతో విశాఖలో ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విఠల్ వెల్లడించారు.

