బట్టలు కొనుక్కోడానికి షాపింగ్ మాల్ లకి వెళ్లడం, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల్లో చూసి ఆర్డర్ చేసేవాళ్లం. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన డ్రెస్ సైజు చెబితే ఏ బట్టలు కొనుక్కోవాలో చెప్పే కొత్త ఈ కామర్స్టెక్నాలజీని గూగుల్ డెవలప్ చేసింది. ఇది బెస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌తోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సాయంతో సైట్‌కు కొత్త ఫీచర్లు యాడ్ చేయనుంది.
ఆర్డర్ చేసిన దుస్తులు మనకు ఎలా కనిపిస్తాయో ప్రివ్యూ చేయడానికి వినియోగదారులకు సాయపడే పలు ఫీచర్స్‌ని గూగుల్ ఆవిష్కరించింది. వీటిల్లో ప్రొడక్స్ట్ గమ్యస్థానాలు కనుక్కోవడానికి, ట్రిప్ రకాన్ని ఎంచుకోవడానికి రిసర్చ్, ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఈ ఫీచర్లలో ఉంది. టెక్ దిగ్గజం ఉపయోగించే ఈ హైలెవల్ టెక్నాలజీ ప్రాంప్ట్‌ల ఆధారంగా టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించే సామర్థ్యాన్ని కూడా ఈ కామర్స్ సైట్ కలిగి ఉంటుంది.
పోటీ పడుతున్న గూగుల్..
గూగుల్ టెక్ దిగ్గజం అయినప్పటికీ, ఉత్పత్తి శోధనలు, పరిశోధనల పరంగా అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోంది. సెర్చ్ మార్కెట్‌పై గూగుల్ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, 46 శాతం యూఎస్ షాపర్‌లు అమెజాన్‌లో తమ ప్రొడక్ట్ ని సర్చ్ చేస్తున్నారని సివిక్ సైన్స్ సర్వే వెల్లడించింది.
వర్చువల్ ట్రై-ఆన్
గూగుల్ 'వర్చువల్ ట్రై ఆన్' ఫీచర్‌ను పరిచయం చేసింది, ఇది XXS, 4XL నుంచి వివిధ బాడీ పర్సనాలిటీలకు దుస్తులు ఎలా సరిపోతాయో చూసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. బట్టలు మనకు ఎలా కనిపిస్తాయి, సరిపోతాయి అనే దాని గురించి వినియోగదారులకు సరైన సమాచారం అందించడం ఈ ఫీచర్ ముఖ్య లక్ష్యం. ముడతలు పడిన, సాగిన దుస్తుల లక్షణాల్ని కూడా ఈ ఫీచర్ పరిశీలిస్తుంది. ఫస్ట్‌ఫేజ్‌లో ఇది మహిళల టాప్స్ పై దృష్టి పెట్టింది. పురుషుల దుస్తులపై తదుపరి దశలో ఫోకస్పెట్టనున్నాయి. ఈ కొత్త AI ఫీచర్ల వెనుక ఉన్న సాంకేతికతను వివరించే రిసర్చ్ డాక్యుమెంట్‌ని కూడా గూగుల్ విడుదల చేసింది.
