గూగుల్‌‌ సెర్చ్‌‌తో మొబైల్‌‌ రీచార్జ్‌‌ చేసుకోండిలా…

గూగుల్‌‌ సెర్చ్‌‌తో మొబైల్‌‌ రీచార్జ్‌‌ చేసుకోండిలా…

ఆన్‌‌లైన్‌‌కు సంబంధించి సేవల్ని విస్తరించే ఆలోచనలో ఉన్న గూగుల్ తాజాగా మరో సర్వీస్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌‌ మొబైల్‌‌ యూజర్లు తమ ఫోన్లలో డైరెక్ట్‌‌గా గూగుల్‌‌ సెర్చ్‌‌ నుంచే మొబైల్‌‌ రీచార్జ్‌‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇది చాలా సింపుల్‌‌. ఆండ్రాయిడ్‌‌ మొబైల్‌‌లో గూగుల్‌‌ సెర్చ్‌‌లో ‘ప్రీపెయిడ్‌‌ మొబైల్‌‌ రీచార్జ్‌‌’ లేదా ‘సిమ్‌‌ రీచార్జ్‌‌’ అని టైప్‌‌ చేస్తే చాలు. కింద సెర్చ్‌‌ రిజల్ట్స్‌‌లో మొబైల్‌‌ రీచార్జ్‌‌ సెక్షన్‌‌ కనిపిస్తుంది. మొబైల్‌‌ నెంబర్‌‌‌‌, సర్వీస్‌‌ ప్రొవైడర్‌‌‌‌, సర్కిల్‌‌ వివరాలతోపాటు కింద రకరకాల మొబైల్‌‌ ప్లాన్స్‌‌ కనిపిస్తాయి. వాటిలోంచి కావాల్సిన ప్లాన్‌‌ సెలెక్ట్‌‌ చేసుకుంటే దాని కింద చెక్‌‌ ఔట్‌‌ ఆప్షన్స్‌‌ కనిపిస్తాయి. ‘గూగుల్‌‌ పే, ఫ్రీ చార్జ్‌‌, పేటీఎమ్‌‌, మొబిక్విక్‌‌’ వంటి పేమెంట్ ఆప్షన్స్‌‌లోంచి కావాల్సింది సెలెక్ట్‌‌ చేసుకుని రీచార్జ్‌‌ చేసుకోవచ్చు.