సోనియా, రాహుల్, రేవంత్‌‌‌‌‌‌‌‌కు బంజారాల కృతజ్ఞతలు

 సోనియా, రాహుల్, రేవంత్‌‌‌‌‌‌‌‌కు  బంజారాల కృతజ్ఞతలు
  • గోరుబొలి భాషను 8వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంపై హర్షం 

న్యూఢిల్లీ, వెలుగు: లంబాడా, బంజార జాతికి కాంగ్రెస్ చేసిన మేలుకు గుర్తుగా ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల చిత్ర పటాలకు గిరిజనులు పాలాభిషేకం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో బంజార భారత్ ఫౌండర్ చైర్మన్, రవీంద్ర నాయక్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో లంబాడ సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పాల్గొన్నారు. అనంతరం రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బంజారా, లంబాడీలు మాట్లాడే గోరుబోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు.