గార్బేజ్ ఫ్రీ సిటీలకు కేంద్రం రేటింగ్

గార్బేజ్ ఫ్రీ సిటీలకు కేంద్రం రేటింగ్

గార్బేజ్ ఫ్రీ సిటీలుగా రాజ్ కోట్, ఇండోర్, నవీ ముంబై
6 సిటీలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఫైవ్ స్టార్ గార్బే్జ్ ఫ్రీ సిటీలుగా రాజ్ కోట్, ఇండోర్, నవీ ముంబై నిలిచాయి. ఢిల్లీకి త్రీస్టార్ వచ్చింది. వేస్ట్ మేనేజ్ మెంట్ లో సిటీలకు స్టార్ రేటింగ్ ఇస్తూ కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 141 సిటీల్లో ఆరు సిటీలకు ఫైవ్ స్టార్, 65 సిటీలకు త్రీస్టార్, ఏడు సిటీలకు సింగిల్ స్టార్ వచ్చింది. చత్తీస్ గఢ్ లోని అంబికాపూర్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, గుజరాత్ లోని రాజ్ కోట్, సూరత్, కర్నాటకలోని మైసూర్, మహారాష్ట్రలోని నవీ ముంబైకి ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కింది. ఢిల్లీ, హర్యానాలోని కర్నాల్, ఏపీలోని తిరుపతి, విజయవాడ, చండీగఢ్, చత్తీస్ గఢ్ లోని భిలాయ్ నగర్, గుజరాత్ లోని అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ లోని భోపాల్, జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ సిటీలకు త్రీస్టార్ వచ్చింది.