V6 News

చెల్లింపుల ఒత్తిడి తగ్గించేందుకు..రూ.12 వేలకోట్ల విలువైన సెక్యూరిటీలను కొన్న కేంద్రం

చెల్లింపుల ఒత్తిడి తగ్గించేందుకు..రూ.12 వేలకోట్ల విలువైన సెక్యూరిటీలను కొన్న కేంద్రం

న్యూఢిల్లీ: ఆర్బీఐ నిర్వహించిన వేలంలో భారత ప్రభుత్వం రూ.12,686.97 కోట్ల విలువైన ప్ర భుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేసింది. వీటికి బదులుగా రూ.13,311.38 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడువు ముగిసే బాండ్లతో పాటు 2027, 2028, 2029 సంవత్సరాల్లో మెచ్యూరిటీ గల సెక్యూరి టీలను వెనక్కి తీసుకుంది. ఈ చర్య వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి చెల్లింపుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. 2027 ఆర్థిక సంవత్సరంలో రూ.5.47 లక్షల కోట్ల విలువైన బాండ్ల మెచ్యూరి టీ గడువు ముగియనుంది. ప్రభుత్వం ఇప్పటికే రూ.17.2 లక్షల కోట్ల స్థూల అప్పులను బడ్జెట్లో ప్రతిపాదించింది.