హైదరాబాద్ లో మరో స్టీల్‌ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ లో మరో స్టీల్‌ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో దుర్గం చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దారు. అక్క‌డ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి న‌గరానికి కొత్తి అందాలను తీసుకొచ్చింది. ఇప్పుడు అలాంటి మ‌రో స్టీల్ వంతెన‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. మెహిదీప‌ట్నం దగ్గర పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్కై వాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపిన‌ట్లు మున్సిపల్  శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్ ట్వీట్ చేశారు.

త్వ‌ర‌లోనే ఈ నిర్మాణానికి టెండ‌ర్లను ఆహ్వానించ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్క‌డున్న బ‌స్ షెల్ట‌ర్స్ ను కూడా రీడిజైన్ చేయ‌నున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో నిర్మించ‌నున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. రైతు బ‌జార్‌లో రెండు లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.