ఎస్సీ గురుకులాల్లో టైం టేబుల్ మార్పు

ఎస్సీ గురుకులాల్లో టైం టేబుల్ మార్పు
  • ఉదయం 9 నుంచే బడి.. 8 నుంచి స్టార్ట్ అయ్యే విధానానికి ఫుల్​స్టాఫ్
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలుకు నిర్ణయం    
  • కొత్త టైం టేబుల్​ను రిలీజ్ చేసిన ఇన్​చార్జి సెక్రటరీ 

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల స్టూడెంట్స్​కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 8 గంటలకు స్టార్ట్ అవుతున్న  టైం టేబుల్​ను 9 గంటలకు మార్చింది. ఈ అంశంపై  జోనల్ ఆఫీసర్లకు, ప్రిన్సిపాల్స్​కు, ఇన్​చార్జి సెక్రటరీ శారద సర్కులర్ పంపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.

వర్కింగ్ డేస్​లో ఉదయం 5 గంటలకు స్టార్ట్  అవుతున్న టైం టేబుల్  రాత్రి  9.15 కు ముగియనుంది.  సెలవు రోజుల్లోనూ టీచర్లు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇద్దరు టీచర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరో ఇద్దరు టీచర్లు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు షిఫ్టుల వారీగా ఉండాలి. ప్రతిరోజూ ఓ టీచర్ రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయి రాత్రి 9.15 కు ముగియనుంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న టైం టేబుల్ సమస్యను  పరిష్కరించడం అభినందనీయమని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జాయింట్ ఫోరమ్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు మధుకర్, తీగల అంజయ్య, ఆవుల సైదులు, బాలస్వామి, వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, గట్టు గజేందర్, యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.