
థియేటర్లలో పార్కింగ్ ఫీజుల వసూలుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో 63ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆవరణలో నిలిపి ఉంచే వెహికిల్స్ కు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. వాణిజ్య సముదాయాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం యథాతథంగా ఉచిత పార్కింగ్ కొనసాగుతుందని తెలిపింది. కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా దగ్గింది. ఈ విషయంపై పలు థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం నిబంధనలు సవరించి కొత్త జీవో జారీచేసినట్టు తెలుస్తోంది.