సచివాలయంలోని మసీద్ కూల్చివేతపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. మసీద్ కూల్చివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. సయ్యద్ యాసన్ , మహమ్మద్ ముజాఫరుల్ల , ఖాజా అజ్జాజుదీన్ పిటిషన్లు దాఖలు చేశారు. సెక్రటేరియట్ లో వక్ఫ్ బోర్డ్ భూమి ఉందని వారు తెలిపారు. మసీదును కూల్చివేయడం చట్ట విరుద్ధమన్నారు. 657 గజాలు ఉన్న మసీద్ ను కూల్చివేసి 1500 sft స్థలం ఇవ్వడం పై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.
అయితే సచివాలయం కూల్చివేతలో భాగంగా… మసీద్ కూడా కూలిపోయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో కొత్త మసీద్‌ను నిర్మిస్తామన్నారు. అయితే మసీద్ ను ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీద్ నిర్మించాలన్నారు పిటిషనర్లు. దీనిపై విచారించిన కోర్టు దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవంది కోర్టు. అంతేకాదు గుడి లోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని….మనసులో దేవుడు ఉంటే ఎక్క డైన ప్రార్థన చేసుకోవచ్చంది. ప్రజా అవసరాల కోసం మసీద్‌లను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని.. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబంధించి నష్ట పరిహారం చెల్లించాలంది హైకోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
