5జీ బిడ్స్‌‌‌‌ వేయడంలో దూకుడు చూపించని కంపెనీలు

 5జీ బిడ్స్‌‌‌‌ వేయడంలో దూకుడు చూపించని కంపెనీలు

న్యూఢిల్లీ : 5జీ స్పెక్ట్రమ్‌‌‌‌ వేలం మొదటి రోజు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి.  ఐదో రౌండ్ బుధవారం జరగనుంది.  5జీ వేలం మంగళవారం ఉదయం 10 గంటలకు స్టార్ట్‌‌‌‌ కాగా, సాయంత్రం ఆరు వరకు కొనసాగింది. మొదటి రోజు వేలంలో టెలికం కంపెనీలు దూకుడుగా పాల్గొనలేదు. 5జీ  వేలంలో 72 గిగా హెడ్జ్‌‌‌‌ రేడియో వేవ్స్‌‌‌‌ను అమ్మకానికి పెట్టారు. వీటి విలువ కనీసం రూ. 4.3 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికం మాత్రం ఈ ఆక్షన్ ద్వారా రూ. 70 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు రెవెన్యూ వస్తుందని భావిస్తోంది. ముకేశ్‌‌‌‌ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్‌‌‌‌కు చెందిన  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, గౌతమ్ అదానీ కంపెనీ అదానీ  డేటా నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌, వొడాఫోన్ ఐడియాలు 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు బిడ్స్‌‌‌‌ వేస్తున్నాయి.  

5జీ ఆక్షన్‌‌‌‌లో 600, 700, 800, 900,1800, 2100,2300 మెగా హెడ్జ్‌‌‌‌ వంటి తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు, 3300 మెగా హెడ్జ్‌‌‌‌ (మిడ్‌‌‌‌ లెవెల్‌‌‌‌), 26 గిగా హెడ్జ్‌‌‌‌ (హై లెవెల్‌‌‌‌) ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను అమ్మకానికి పెట్టారు. 5జీ స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం జియో రూ. 14 వేల కోట్లను ఎర్నస్ట్‌‌‌‌ మనీ డిపాజిట్‌‌‌‌ (ఈఎండీ–అడ్వాన్స్ అనుకోవచ్చు) గా  కట్టింది.  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ రూ. 5,500 కోట్లను, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లను, అదానీ డేటా నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌ రూ. 100 కోట్లను ఈఎండీ కింద సబ్మిట్ చేశాయి. ఈఎండీ చూస్తుంటే వేలంలో జియో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈఎండీ కంటే 7–8 రెట్లు ఎక్కువ అమౌంట్‌‌‌‌ను కంపెనీలు వేలంలో ఖర్చు చేయొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.  జియో రూ. 1. 2 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ రూ. 48 వేల కోట్ల విలువైన బిడ్స్ వేయొచ్చని అన్నారు. వొడాఫోన్ ఐడియా రూ. 20 వేల కోట్ల విలువైన బిడ్స్‌‌‌‌ను,అదానీ డేటా నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌ రూ. 700 కోట్ల విలువైన బిడ్స్‌‌‌‌ను వేయొచ్చని అంచనా వేశారు.