అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి పేదవాడికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని సూచించారు. 

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ సునేంద్ర, కౌన్సిలర్ నిజాం, నాయకులు రమేశ్, రాజు పాల్గొన్నారు.