రాహుల్ గాంధీపై ప్రభుత్వం ఎలాంటి తీర్మానం చేయట్లే..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

రాహుల్ గాంధీపై ప్రభుత్వం ఎలాంటి తీర్మానం చేయట్లే..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకరమైన భాషను ఉపయోగించినందుకు లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీర్మానం తీసుకురావాలనే ప్రణాళికను ప్రభుత్వం పక్కన పెట్టిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాహుల్​వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే (ఝార్ఖండ్) సబ్‌‌‌‌ స్టాంటివ్ మోషన్ నోటీసు ఇచ్చినందున.. ప్రభుత్వం తన సొంత తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని హౌస్ ప్రివిలేజ్ కమిటీకి, ఎథిక్స్ కమిటీకి పంపాలా? లేదా నేరుగా లోక్‌‌‌‌సభకు తీసుకురావాలా? అనే దానిపై స్పీకర్‌‌‌‌తో సంప్రదిస్తామని  పేర్కొన్నారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా, గురువారం బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్​గాంధీ లోక్‌‌‌‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితాంతం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని  డిమాండ్ చేస్తూ సబ్‌‌‌‌ స్టాంటివ్ తీర్మాన నోటీసు ఇచ్చానని చెప్పారు.