డీఏవీ స్కూలును ప్రభుత్వం నడిపించాలి: విద్యార్థి సంఘాలు

డీఏవీ స్కూలును ప్రభుత్వం నడిపించాలి: విద్యార్థి సంఘాలు

ఇటీవల సంచలనం సృష్టించిన డీఏవీ స్కూలు ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ వద్ద వామపక్ష విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రన్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నా చేపట్టారు.  చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్కూల్ లో రక్షణ చర్యలు చేపట్టాలని ఐద్వా, ఎస్.ఎఫ్. ఐ, డీ.వై.ఎఫ్.ఐ  డిమాండ చేశాయి. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు.. ఆందోళన కారులను అడ్డుకున్నారు. 

డీఏవీ స్కూల్ లో చదివే తల్లిదండ్రులు పలువురి పేరెంట్స్ అభిప్రాయాలను సేకరించి బ్యాలెట్ బాక్స్ రూపంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఒపీనియన్ బాక్స్ తీసుకొచ్చారు. ముక్తకంఠంతో స్కూల్ ని రీఓపెన్ చేయాలంటూ తల్లిదండ్రులంతా డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ల ద్వారా వెంటనే దోషుల్ని శిక్షించాలని కోరారు.

అసలేమైందంటే...

బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ LKG చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డిజిటల్ క్లాస్ రుమ్లోకి  వెళ్లి నీచుడు రజనీ కుమార్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కీచకుడు స్కూళ్లో  మరికొంత మంది విద్యార్థులపై కూడా వేధింపులకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల ఆందోళన..

డీఏవీ  పాఠశాల లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో డీఏవీ స్కూల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.అటు డ్రైవర్ రజినీ కుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవి పై కేసు నమోదయింది. ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.