ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలం.. నవంబర్ 8 నుంచి కాలేజీలు రీ ఓపెన్

ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలం.. నవంబర్ 8 నుంచి కాలేజీలు రీ ఓపెన్

హైదరాబాద్: ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్యతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో కాలేజీల బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. కాగా, పెండింగ్‎లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య బంద్‎కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 7) ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్యతో ప్రజా భవన్‎లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. తక్షణమే రూ.600 కోట్ల నిధుల విడుదల చేసేందుకు భట్టి అంగీకరించారు. మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లి్స్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌‎పై ప్రభుత్వ కమిటీ వేస్తామని.. కమిటీలో ప్రభుత్వాధికారులతో పాటు కాలేజీ యాజమాన్యాల సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు.

 కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైనా సంస్కరణలు అవసరమో చేపడతామని తెలిపారు. భట్టి ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అంగీకారం తెలపడంతో చర్చలు సఫలం అయ్యాయి. చర్చలు ఫలించడంతో బంద్ విరమిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో 2025, నవంబర్ 8 నుంచి కాలేజీలు యధావిధిగా నడవనున్నాయి.