కుటుంబ కలహాలతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ ప్రభుత్వ టీచర్​ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని గొల్లగూడెం రైటర్‌‌‌‌‌‌‌‌బస్తీకి చెందిన భూక్యా నాగేశ్వరరావు, కవిత(37) దంపతులు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కవిత భద్రాచలంలో, నాగేశ్వరరావు బూర్గంపహాడ్‌‌‌‌‌‌‌‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కవిత గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. ఈ ఘటనపై నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయారు. భర్త వేధింపుల వల్లే కవిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదినారాయణ, ఎస్సై విజయ ఘటన స్థలాన్ని పరిశీలించారు.