వేము లవాడ టౌన్ ను అభివృద్ధి చేయాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేము లవాడ టౌన్ ను అభివృద్ధి చేయాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  •     ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: కౌన్సిలర్లు అధికారుల సమన్వయంతో వేములవాడ టౌన్​ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​సూచించారు. శనివారం వేములవాడ మున్సిపల్ చైర్​పర్సన్ గా పుల్కం రాజు, వైస్ చైర్​పర్సన్ గా నరాల శేఖర్ బాధ్యతలు స్వీకరించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలు మనకు పాస్ మార్కులు ఇచ్చారని, మంచిగా పనిచేసి రానున్న రోజుల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు పొందాలన్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

రాజన్న ఆలయం, వేములవాడ పట్టణ అభివృద్ధి రెండు కళ్లతో సమానన్నారు. వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి మీదుగా సిరికొండ వరకు 100 ఫీట్ల రోడ్డు, హన్మాజీపేట నుంచి అజ్మీరా తండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్​ కె. సంపత్​కుమార్, మేనేజర్​ సంపత్​ రెడ్డి, టౌన్ ప్లానింగ్​ఆఫీసర్లు అన్షర్, వినోద్, శానిటరీ ఇన్​స్పెక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.  ​