ఉప్పల్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ఆదివారం మాణికేశ్వర్‌నగర్‌లో ఎస్ హెచ్ జీ సభ్యులకు ఆమె ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర సర్కారు స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు, ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తదితర అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 7.10 లక్షల మంది మహిళలకు చీరలతోపాటు అర్హులకు 40 ఎగ్ కార్టులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్ మోతె శోభన్ రెడ్డి, కాంగ్రెస్సికింద్రాబాద్నియోజకవర్గ ఇన్చార్జి ఆడం సంతోష్‌కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
