ఏపీ‌ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

ఏపీ‌ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

అమరావతి : ఏపీలో గ్రామాల రూపురేఖలు మార్చామన్నారు సీఎం  జగన్.  గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. క్యాంప్  ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతోనే ఏపీ ఏర్పడిందన్నారు జగన్. దేశంలో  ఏ రాష్ట్రం పడనంత ఏపీ   దగా పడిందని అన్నారు. పాదయాత్రలో  ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను గుర్తించానని.. అవినీతి, వివక్ష లేకుండా 17 నెలల పాలన సాగిందని తెలిపారు.

గతంలో చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని..  నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయన్నారు. ఇళ్ల కోసం 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని… బయటవారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగా పడ్డామన్నారు. కులాల కలుపు మొక్కలు రాష్ట్ర పరువు తీస్తున్నాయన్న జగన్.. వ్యవస్థలను వ్యక్తులు మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని దెబ్బతీస్తోందన్నారు. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకువెళ్తున్నామన్నారు ఏపీ సీఎం‌ జగన్.