స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి : గవర్నర్ తమిళసై

స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి : గవర్నర్ తమిళసై
  • గవర్నర్ తమిళి సై

సికింద్రాబాద్, వెలుగు : స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుసాగాలని గవర్నర్ తమిళసై సూచించారు.  సిటిజన్ యూత్ పార్లమెంట్ ముగింపు 
ప్రోగ్రామ్ మంగళవారం ఉస్మానియా వర్సిటీలోని పీజీఆర్ఆర్​సీడీఈ ఆడిటోరియంలో జరిగింది. చీఫ్ గెస్ట్​గా గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్​ అని, స్వాతంత్ర్య పోరాటంలో యువత పాత్ర ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ దేశానికి ఏం చేయగలరో ఆలోచించుకోవాలన్నారు. ఓటమిని కూడా ఆస్వాదించాలన్నారు.

25 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకుల ఆత్మహత్యలపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, సీనియర్ జర్నలిస్టు వల్లీశ్వర్, ఓయూ అధికారులు పాల్గొన్నారు. సిటిజన్ యూత్​ పార్లమెంట్​ ప్రోగ్రామ్​లో190 మంది పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన 17 మందిని ఎంపిక చేశారు. వారిని జాతీయస్థాయిలో జరిగే యూత్ పార్లమెంట్​కు పంపించనున్నారు.