నవంబర్‌‌ 18 నుంచి పార్లమెంట్‌‌ సమావేశాలు

నవంబర్‌‌ 18 నుంచి పార్లమెంట్‌‌ సమావేశాలు

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌‌ శీతాకాల సమావేశాల తేదీలు  ఫైనల్‌‌ అయ్యాయి. సెషన్స్‌‌ నవంబర్‌‌ 18 నుంచి  ప్రారంభమై, డిసెంబర్‌‌ 13 వరకు కొనసాగుతాయి. మినిస్ట్రీ ఆఫ్‌‌ పార్లమెంటరీ ఎఫైర్స్‌‌  ఈమేరకు లోక్‌‌సభ, రాజ్యసభ సెక్రటరీలకు షెడ్యూల్‌‌ పంపినట్టు అధికారవర్గాలు చెప్పాయి. ఈ శీతకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులు చర్చకు వచ్చే అవకాశముంది. చాలా ఆర్డినెన్స్‌‌లు కూడా సభ ముందుకు  రానున్నాయి. కార్పొరేట్‌‌ పన్ను తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌‌, ఈ- సిగరెట్ల బ్యాన్‌‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌‌లను ఈ సెషన్స్‌‌లో  బిల్లుల రూపంలో ఆమోదించనున్నారు.   గత  రెండేళ్లలో శీతాకాల సమావేశాలు నవంబర్‌‌ 21 ప్రారంభమై జనవరి మొదటివారంలో పూర్తయ్యాయి.

Govt announces Parliament winter session from November 18