DRDOలో పెయిడ్ ఇంటర్న్షిప్

DRDOలో పెయిడ్ ఇంటర్న్షిప్

సీహెచ్ఈఎస్ఎస్​లో హైదరాబాద్​లోని సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డీఆర్​డీఓ(సీహెచ్ఈఎస్ఎస్, డీఆర్ డీఓ) 2‌‌0 పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 15.

పోస్టుల సంఖ్య: 20

పోస్టులు: ఫిజిక్స్/ అప్లైడ్ ఆప్టిక్స్ 06, మెకానికల్ ఇంజినీరింగ్ 06, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్ 05, కంప్యూటర్ సైన్స్ 03.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/ సెన్స్​లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. 

వయోపరిమితి: 28 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 01.

లాస్ట్ డేట్: జులై 15. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎల్ఆర్ డీఈలో 

ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్​మెంట్(ఎల్ఆర్​డీఈ, డీఆర్​డీఓ) పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 14.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఈ లేదాబీటెక్ మూడో సంవత్సరం/ ఆరో సెమిస్టర్ టర్మ్ ఎండ్ పరీక్షలను పూర్తి చేయడంతోపాటు మొదటి, రెండో, మూడో లేదా 1 నుంచి ఆరు సెమిస్టర్లలో 70 శాతం కంటే తక్కువ కాకుండా మార్కులు సాధించి ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

డీఈఏఎల్​లో  

డీఆర్​డీఓ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ లాబొరేటరీ(డీఆర్​డీఓ డీఈఏఎల్) పెయిడ్​ ఇంటర్న్​షిప్ కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ  జులై 18.

పోస్టుల సంఖ్య: 45

పోస్టులు:  పెయిడ్ ఇంటర్న్​షిప్స్(ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) 20, పెయిడ్ ఇంటర్న్​షిప్స్(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) 20, పెయిండ్ ఇంటర్న్​షిప్స్ (మెకానికల్ ఇంజినీరింగ్) 05.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఈ లేదా బీటెక్ మూడో సంవత్సరం లేదా ఆరో సెమిస్టర్ పూర్తి చేసి, 2025, ఆగస్టు నెలలో నాలుగో సంవత్సరం లేదా ఏడో సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు అర్హులు. 

లాస్ట్ డేట్: జులై 18.  

స్టైఫండ్: డీఆర్​డీఓ మార్గదర్శకాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5000. స్టైఫండ్​ను రెండు సమాన వాయిదాల్లో అంటే 3 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000, 6 నెలలు పూర్తయిన తర్వాత రూ.15,000 చెల్లిస్తారు. పూర్తి వివరాలకు  drdo.gov.in వెబ్​సైట్​లో చూడగలరు.