కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే 23 నుంచి సమ్మె

కార్మికుల డిమాండ్లు పరిష్కరించకపోతే 23 నుంచి సమ్మె
  • బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఊదరి గోపాల్

హైదరాబాద్, వెలుగు : బల్దియాలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 23 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జీహెచ్ఎంఈయూ, బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మెన్ ఊదరి గోపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం చార్మినార్ జోనల్ ఆఫీసు వద్ద కార్మికులతో కలిసి  ఆయన ఆందోళన చేపట్టారు. గోపాల్​ మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్​ కార్మికులను పర్మినెంట్ చేయడం, బయోమెట్రిక్ సమస్య, ఇతర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.  ఒక్కొక్కటిగా ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల జీవితాలలో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 23న బల్దియా హెడ్డాఫీసు నుంచి టీఆర్ఎస్ భవన్ వరకు చెత్త లారీలతో నిరసన ఉంటుందన్నారు. ఆందోళనలో  రాము, సునీల్, మల్లేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.