
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... త్వరలో వాళ్లంతా కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. ప్రజాపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీజేపీ, బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరన్నారు.
ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్..చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిన్న కంటోన్మెంట్ బీజేపీ ఇన్ చార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లాలోనూ బీఆర్ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.