మంత్రిని పొన్నం ప్రభాకర్ కలిసిన గౌడ సంఘం ప్రతినిధులు

మంత్రిని పొన్నం ప్రభాకర్  కలిసిన గౌడ సంఘం ప్రతినిధులు

కొమురవెల్లి, వెలుగు: రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కొమురవెల్లి మండల గౌడ సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్న స్వామి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్యగౌడ్ , గౌడ సంఘం ప్రతినిధులు నర్సింలు గౌడ్, గురువయ్య గౌడ్, భిక్షపతిగౌడ్ , సత్తయ్య గౌడ్, ఉప్పలయ్య గౌడ్, పర్శరాములు గౌడ్, యాదగిరి గౌడ్, నాగరాజు గౌడ్, నర్సింలు గౌడ్ పాల్గొన్నారు.