శివ్వంపేట, వెలుగు: కొడుకుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మణ్(50)కు ఇద్దరు కొడుకులు హరీశ్, మహేశ్, ఒక కూతురు ఉన్నారు.
భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, కూతురికి వివాహం చేశారు. ఇద్దరు కొడుకులు ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై తరచూ తండ్రిని డబ్బుల కోసం వేధించేవారని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రాత్రి కొడుకులు తాగి దాడి చేయడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హరీశ్, మహేశ్‌పై దాడి చేశారు.
