గండిపేట, వెలుగు: నార్సింగిలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న వేడుకలు ప్రారంభం కాగా, రెండో రోజు ఆదివారం మల్లన్న స్వామి, భ్రమరాంబిక దేవి కల్యాణం నిర్వహించారు.
నార్సింగి మాజీ సర్పంచ్ ప్రసన్న అశోక్ యాదవ్ దంపతులు స్వామివారి కల్యాణ వేడుక నడిపించారు. ఉదయం గణపతి పూజ, గణపతి హవనం, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, సౌడమ్మ బోనాలు, మల్లన్న ఒగ్గు కథ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
