అమ్మవారి చెంతన ఆధ్యాత్మిక కీర్తనలు

అమ్మవారి చెంతన ఆధ్యాత్మిక కీర్తనలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైటెక్​ సిటీ కోహినూర్​ లో దుర్గామాత  నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం కోహినూర్ బై ఆరో ‘నవదుర్గా స్వరూపిణి’ పేరుతో ప్రత్యేక భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. 

హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో జరిగిన ఈ వేడుకలో భక్తి గీతాలు శ్రోతలను ఆధ్మాత్మికంలో ముంచెత్తాయి. ప్రతిమశశిధర్  గాత్రం ఆకట్టుకుంది. భక్తిగీతాల నేపథ్యాన్ని, ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మహీధర సీతారామశర్మ వివరించారు. అనంతరం కోహినూర్ నిర్వాసితులు కళాకారులను సత్కరించారు.