- హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి
షాద్ నగర్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ, నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే మాజీ మంత్రులు హరీశ్ రావు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు సైతం ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
