మధిర పట్టణంలోని వైభవంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం

 మధిర పట్టణంలోని వైభవంగా రామయ్య పట్టాభిషేక మహోత్సవం

మధిర, వెలుగు: మధిర పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమ్మ ఫౌండేషన్ చైర్​పర్సన్ మల్లు నందిని విక్రమార్కకు ఆలయ కమిటీ చైర్మన్ వంగవేటి రాజశేఖర్, ప్రధాన అర్చకులు నారాయణచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనం స్వాగతం పలికారు. 

అనంతరం మల్లు నందిని విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ సామినేని సుజాత, కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మధిర మండలాధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్, పట్టణాధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, భక్తులు తదితరులు పాల్గొన్నారు.