కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల లో శనివారం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరాముడు, హనుమాన్, భరతమాత విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వీర హానుమాన్ విజయ యాత్రను ప్రారంభించారు.
శ్రీ వేంకటేశ్వరాలయం నుంచి గాంధీరోడ్డు మీదుగా కార్గిల్ చౌరస్తా , కొత్తబస్టాండ్ మీదుగా అంబేద్కర్ నగర్, కాల్వగడ్డ మీదుగా వేంకటేశ్వరాలయం వరకు యాత్ర కొనసాగింది. యాత్రలో దండి పీఠాధిపతి స్వామిజీ , బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ పాల్గొన్నారు.
