ప్రభుత్వ విప్‌‌‌‌ విజయరమణారావుకు ఘన స్వాగతం

ప్రభుత్వ విప్‌‌‌‌ విజయరమణారావుకు ఘన స్వాగతం

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ విప్‌‌‌‌గా నియమితులైన తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జెండా చౌరస్తా వరకు చేరింది. రాజీవ్ రహదారి పొడవునా ప్రజలు, అభిమానులు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికి శాలువాలు, పూల మాలలతో సత్కరించారు. సుల్తానాబాద్‌‌‌‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకుడు పల్ల సురేశ్ ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో భారీ గజమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌‌‌‌గా అవకాశం రావడం గొప్ప విషయమని, ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందన్నారు. తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు బిరుదు రాధాకృష్ణ, నుగిళ్ల మల్లయ్య, వైస్ చైర్ పర్సన్ పుష్పలత, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్‌‌‌‌రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.