
కాశీబుగ్గ/కార్పొరేషన్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్13వ డివిజన్లోని ఎంహెచ్నగర్లో చిల్డ్రన్ మైక్రో పార్కును 56 గంటల్లో ఏర్పాటు చేశారు. బల్దియా మేయర్గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బుధవారం పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్మహోత్సవ్లో భాగంగా 75 గంటల్లో మైక్రో పార్కు ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకోగా 56 గంటల్లోనే పనులు పూర్తి చేశామన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇక్కడ నివసించే 200 నుంచి 300 మంది పిల్లలకి పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.