ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు గ్రీన్ సిగ్నల్

రూ.50 కోట్లతో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని కోసం కేంద్రం వసంత్ విహార్ ఏరియాలో వెయ్యి గజాల స్థలం కేటాయించింది. స్థలానికి గజం రూ.50 వేల చొప్పున మొత్తం రూ.5 కోట్లు ఖర్చయినట్లు టీఆర్ఎస్ లీడర్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిసింది. ఆ తర్వాత పార్టీ ఆఫీసు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు . హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ తరహాలో ఢిల్లీలోనూ పార్టీ ఆఫీసు నిర్మించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ఓ సీనియర్ లీడర్ చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.