తెలంగాణలో భారీగా పడిపోతున్న గ్రౌండ్ లెవల్ వాటర్

తెలంగాణలో భారీగా పడిపోతున్న గ్రౌండ్ లెవల్ వాటర్

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్​ బెల్స్​ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్​ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్​తో  మార్చిలోనే  ఎండలు మండిపోతుండటంతో  ప్రధాన జలాశయాల్లోని వాటర్ ​లెవల్స్​ వేగంగా పడిపోతున్నాయి

జనవరి నుంచే పడిపోతున్న గ్రౌండ్​ వాటర్​

ఈ ఏడాది జనవరి నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్​వాటర్​ లెవల్స్​ పడిపోతు న్నట్టు భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. జనవరిలో సగటు నీటిమట్టం 6.22 మీటర్లు కాగా.. ఇప్పటికే 7.72 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిజామాబాద్‌‌ జిల్లా గోనుగుప్పులలో ఏకంగా 27.63 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిరుడు  అక్టోబర్​ నుంచి సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గుతూ రావడం, చెరువులు ఎండిపోవడంతో రైతులు తమ పంటలు కాపాడు కునేందుకు బోర్లపై ఆధారపడుతున్నారు. ఈ యాసంగిలో 62.89 లక్షల ఎకరా ల్లో రైతులు పంటలు సాగుచేయగా

అందులో అత్యధికంగా 47.88 లక్షల ఎక రాల్లో వరి వేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థి తులపై రైతులకు అవగా హన కల్పించి, వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచే యించాల్సిన వ్యవసాయాధి కారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఫలి తంగా యాసంగిలో వరిసాగుచేసిన రైతులంతా పంటలను కాపాడుకునేందు కు జనవరి, ఫిబ్రవరి నెలల్లో బోర్లను నిరంతరంగా నడిపించారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి, మార్చి ప్రారంభం నాటికి  కోతకు వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి.