పెగడపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

పెగడపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమిపూజ

పెగడపల్లి,వెలుగు: పెగడపల్లి మండలం ఐతుపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఆయా గ్రామాల సర్పంచులు బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

నాణ్యత లోపం లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసుకొని ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు మ్యాకల అంజమ్మ మల్లయ్య, మ్యాక శ్రీవాణి సుధాకర్, ఉప సర్పంచులు గోలి సంజీవరెడ్డి, అజ్మీర రజిత కుమార్, పంచాయతీ కార్యదర్శులు మంజుల, రజిని కుమార్, తదితరులు పాల్గొన్నారు.